అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ సహకారంతో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ఒరియంటేషన్ కార్యక్రమంను నిర్వహించబడింది. ఆరు వారాలపాటు నిర్వహించబడే ఈ ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఔషధ పరిశ్రమకు సంబంధించిన ప్రాయోగిక శిక్షణ, ప్రయోగశాల అనుభవం పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించబడనున్నాయి.
ఈ కార్యక్రమానికి పరీక్షల డీన్ డాక్టర్ ఎం. ముత్తా రెడ్డి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సవితా బెల్వాల్, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ వసుధా బక్షి, ప్రోగ్రామ్ ఇన్-చార్జ్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చల్లా, హెటెరో ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకృష్ణ, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. నవీన్ కుమార్, హెచ్‌ఆర్ బృంద సభ్యులు, విశ్వవిద్యాలయం పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఔషధ పరిశ్రమలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు వృత్తిపరమైన సామర్థ్యాలపై మార్గదర్శనం అందించబడింది.






