21 July, 2026 | 7:29 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి

16-05-2026 06:45 PM

జమ్మికుంట,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. మండల పరిధిలో మడిపల్లి గ్రామంలో శనివారం  గ్రామపంచాయతీ కార్మికుల గ్రామ కమిటీ సమావేశం అంబాల సదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ...  గ్రామాలను శుభ్రం చేస్తున్న పంచాయతీ కార్మికులకు గత 8 సంవత్సరాలుగా ఒకే జీతంపై పనిచేస్తున్నారని, ప్రభుత్వాలు పని చేయించుకుంటూ వారి శ్రమదోపిడి చేస్తుందన్నారు. కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు.