21 July, 2026 | 6:51 PM

కేటిపిపిలో 25వ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన

21-07-2026 02:42 PM

వైటీపీఎస్ టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ 

గణపురం,(విజయక్రాంతి): వైటీపీఎస్‌ సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ విభాగాల టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని  డిమాండ్ చేస్తూ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం 25వ రోజు నిరసన కార్యక్రమం భారీ వర్షం లోను కొనసాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డు స్లోగన్లతో నిరసన తెలిపారు. కేటీపీపీ ప్రధాన గేటు ఎదురుగా సెంట్రల్ జాక్ ఆదేశాలతో కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని జే ఏ సి ఆదేశాలను పాటించాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు, వివిధ యూనియన్‌లు,  నాయకులు, సభ్యులు, పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.