17 April, 2026 | 5:56 AM

యాదాద్రి స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

29-05-2025 01:15 AM

యాదాద్రి భువనగిరి మే 28 ( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ మధుసూదన్ రావు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.