13 May, 2026 | 12:10 AM

కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లు

24-04-2024 01:31 AM

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 2౩ (విజయక్రాంతి): కూకట్‌పల్లి జిల్లా కోర్టు ఆవరణలోకి ముగ్గురు నిందితులకు పోలీసులు బేడీలు వేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. ముగ్గురు నిందితులను సంకెళ్లతో కోర్టులో హాజరుపర్చేందుకు  తీసుకొచ్చారంటూ ఓ సీనియర్ న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు.  దీనిని పిల్‌గా పరిగణించిన హైకోర్టు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసన ం విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటనలు మరో సారి జరగకుండా తీసుకొనే చర్యలతో కౌంట ర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.