12 May, 2026 | 9:41 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

12-05-2026 08:32 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ని హనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ సేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు గౌరిశెట్టి నాగభూషణరావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటులో హనుమాన్ సేన ఆర్థిక సహకారంతో నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే భక్తులకు పానకం మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరుగుతుంది తెలిపారు.