calender_icon.png 12 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం

12-11-2025 07:21:21 PM

మునుగోడు,(విజయక్రాంతి): రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక ఆదాయం వస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్, పతంజలి ప్లాంటేషన్ ఆఫీసర్ భాను చందర్ అన్నారు. బుధవారం మండలంలోని కొరటికల్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్  సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రభుత్వం తరుపున సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్, అంతర పంటల, ఎరువుల నిమిత్తం సాగుకు ఎకరాకు రూ.4,200/-లను 4 సంవత్సరాల పాటు రైతులకు తెలిపారు. 

ఆయిల్ పామ్ సాగు ఒక్కసారి నాటితే పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై 30 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అని అన్నారు. 200 రూపాయలు విలువ గల మొక్కలను కేవలం 20/-లకే ఒక్కో ఆయిల్ పామ్ మొక్కను రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. మార్కెట్ సమస్య లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పంటను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కుతాటి లక్ష్మయ్య, మానిటరింగ్ అధికారి రేణుక, సీఈవో సుఖేందర్ , పతంజలి ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, గ్రామ రైతులు ఉన్నారు.