calender_icon.png 12 November, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పోలీసులు సహకరించాలి

12-11-2025 07:20:14 PM

మఠంపల్లి: రైతులకు పోలీసులు సహకరించాలని మఠంపల్లి మండల పిఎసిఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య కోరారు. రఘునాథపాలెం, నక్కగూడెం, చింత్రియాల, కిష్టాపురం, గుండ్లపల్లి రైతులు ఎక్కువగా పత్తి, మిర్చి పండిస్తారని పంట చేతికి రావడంతో కూలీల కొరత ఏర్పడడంతో ఇతర గ్రామాల నుండి కూలీలను తీసుకురావడం జరుగుతుందని కొంతమంది వ్యక్తులు పరిమితికి మించి కూలీలలను తరలించడం, అధిక వేగం ప్రమాదాలకు సూచికం అంటూ షోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పోలీస్ అధికారులు వాహనాలను అడ్డుకుంటున్నారని దీనివల్ల రైతులుచాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కావున పోలీసులు సహకారం అందిస్తే రైతులు ఒడ్డున పడతారన్నారు.