calender_icon.png 12 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలి

12-11-2025 07:23:57 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

రేగొండ (విజయక్రాంతి): అధికారులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా జరపాలని, రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బుధవారం మండలంలోని రంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, మొట్లపల్లి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,08,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.