23 July, 2026 | 2:37 AM

హై లైఫ్ జ్యువెల్స్ ఆభరణాల ప్రదర్శన!

23-07-2026 01:31 AM

హైదరాబాద్ నోవొటెల్ హెచ్‌ఐసీసీలో రేపటి నుంచి ప్రారంభం

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): హైదరాబాద్ నోవొటెల్ హెచ్‌ఐసిసిలో ఈ నెల 24 నుంచి ‘హై లైఫ్ జ్యువెల్స్’ అద్భుతమైన ఆభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారతదేశపు అత్యుత్తమ, అగ్రగామి జ్యువెలరీ బ్రాండ్ల కలెక్షన్లతో ‘హై లైఫ్ జ్యువెల్స్’ ఒక ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన జూలై 24, 25, 26 తేదీ లలో మాదాపూర్‌లోని నోవోటెల్ హెచ్‌ఐసీసీ వేదికగా జరగనుంది.

ఒకే గూటి కిందకు దేశంలోని ప్రముఖ జ్యువెలరీ డిజైనర్లను తీసుకువస్తూ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనలో అత్యంత అద్భుతమైన డైమండ్, గోల్డ్, పోల్కీ, కుందన్, విలువైన రత్నాలతో  రూపొందించిన ఆభరణాలు కొలువుదీరనున్నాయి. సాంప్రదా య శైలిని ప్రతిబింబించే బ్రైడల్ (పెళ్లికూతురి) కలెక్షన్లతో పాటు సరికొత్త ఆధునిక డిజైన్ల మాస్టర్పీస్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివాహ శుభకార్యాల కోసం పరిపూర్ణమైన డిజైన్లను ఎంచుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ ఒక సువర్ణ అవకాశం.