నిరుపయోగంగా హైమాస్ట్ లైట్లు
పెంట్లవెల్లి, ఏప్రిల్ 19: మండల పరిధిలోని జటప్రోలు గ్రామం ఎస్సీ కాలనీలో ఐ మాస్ట్ లైట్లు అలంకారప్రాయంగా మారా యి. 11, 12వ వార్డులలో ఏర్పాటు చేసిన మొత్తం ఆరు ఐమాస్ట్ లైట్లలో ఐదు లైట్లు గత ఐదు నెలలుగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం ఒక లైట్ మాత్రమే పనిచేస్తుండగా అది కూడా నామమాత్రంగా వెలుగుతుందని ఫలితంగా ఆ ప్రాంతవాసులు చీకట్లోనే మగ్గుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధు లు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవి కాలం కావడంతో రాత్రివేళల్లో విషసర్పాలు బయటకు రావడంతో ప్రమాదకరంగా మారిం దని వాపోతున్నారు.ఈ సమస్యపై గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పనిచేయని ఐమాస్ట్ లైట్లను మరమ్మతులు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వార్డు పెద్దలు, యువకులు కోరుతున్నారు.






