7 March, 2026 | 8:39 AM

సమీకృత వ్యవసాయం ద్వారా అధిక రాబడి

07-03-2026 01:16 AM

భువనగిరి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత

సంస్థాన్ నారాయణపూర్, మార్చి 6 (విజయక్రాంతి): సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు అదనపు రాబడిని పొందవచ్చని భువనగిరి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త  శ్రీలత అన్నారు. నారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో, ఆత్మ  సౌజన్యంతో రైతులకు సమీకృత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పూజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీలత మాట్లాడుతూ వరిలో యాజ మాన్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, నాచురల్ ఫార్మింగ్, నానో యూరియా, ఆయిల్ ఫామ్, వరిలో మంచి విత్తనాలు గురించి రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి పూజ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, వివిధ రకాల పంట లు యాజమాన్య పద్ధతులు వివిధ పంటల సాగులపై రైతులకు వివరించారు. రైతుల సందేహాలను ఈ సందర్భంగా నివృతి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సైదులు, శివ, స్వప్నిక, శశిబిందు, అనురాధ, సీఆర్పీలు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.