22-02-2026 12:36:34 AM
దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ - లగ్జరీ -లైఫ్ స్టైల్ హైదరాబాద్‌లో ప్రదర్శన
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్, లగ్జరీ,లైఫ్ స్టైల్ ప్రదర్శనగా పేరుగాంచిన ‘హై-లైఫ్ ఎగ్జిబిషన్’ శనివారం హైటెక్ సిటీ లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్ వేదికగా అట్ట హాసంగా ప్రారంభమైంది.
ఈ వేడుకల్లో హై-లైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండీ, సీఈఓ అబీ డొమి నిక్‌తో కలిసి ప్రముఖ సినీ నటి రాశీ సింగ్, నటి, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళా చౌహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అ ద్భుతమైన ఫ్యాషన్లు, పండగ కలెక్షన్లు, జ్యు వెలరీ, డిజైనర్ వేర్ మరియు లైఫ్ స్టైల్ ఉత్ప త్తుల ప్రదర్శన ఈ నెల 23 వరకు హైదరా బాద్‌లోని హైచ్‌ఐసీసీ, నోవాటెల్ (హైటెక్ సిటీ) నందు నిర్వహిస్తున్నారు.
ఈ ఎగ్జిబిషన్ లో పండగలు, వివాహాలు, లైఫ్ స్టైల్ షా పింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా‘ నిలిచే ‘హై-లైఫ్’, సృజనాత్మకమైన ఫ్యాషన్ వేర్, బ్రైడల్ కలెక్షన్లను నిర్వాహకులు ఇక్కడ ప్రదర్శి స్తున్నారు. ప్రముఖ డిజైనర్లు రూపొ ందించిన అద్భుత మైన కళాఖండాలు ఇక్కడ కొలువుదీరాయి. లేటెస్ట్ ట్రెండ్స్, వెడ్డింగ్ స్పెషల్స్, డిజైనర్ వేర్, స్టైలిష్ యాక్సెసరీస్, ఖరీదైన ఆభరణా లు, హోమ్ డెకార్ ఎంతో ఆకర్షణగా కస్టమ ర్స్‌మదిని దోచే ఎన్నో వెరైటీలు ప్రదర్శనలో ఉన్నాయి.వి ఎగ్జిబిషన్ మరో రెండు రోజుల వరకు ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటుంది.