calender_icon.png 22 February, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానక్‌రామ్‌గూడలో ‘ఎవ్వాహ్ వీవర్స్ హబ్’

22-02-2026 12:38:28 AM

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ఫిబ్రవరి (విజయక్రాంతి): సోషలైట్ అలేఖ్య రెడ్డి ఆధ్వ ర్యంలో నానక్‌రా మ్‌గూడ ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్‌లో గల పైర్ వాటర్ ని యో కిచెన్ బాంకెట్ హాల్ లో ఏర్పా టు చేసిన ఎవ్వాహ్ - వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్‌ను శనివారం రాష్ట్ర వ్యవ సాయ, చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు ప్రారంభించారు.ఈ సంద ర్భంగా తుమ్మల మాట్లాడుతూ చేనేత అమ్మ చల్లని ఒడివంటిదని అభివర్ణించారు.  భారతీ య సంస్కృతిలో పట్టు , హ్యాండ్ లూమ్ వస్త్రో త్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.

చేనేత దుస్తులను ప్రతి ఒక్కరు ధరించా లని, చేనేత కారులను మరింత ప్రోత్సహిం చాలని కోరారు. నిర్వాహకులు అలేఖ్య రెడ్డి మాట్లా డుతూ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగు తున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్త్రాలు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పుల కలెక్షన్ వేదికగా బనారసి, కం జీవరం, గద్వా ల్, పోచంపల్లి, మంగళగిరి వంటి విభిన్న వెయ్యి రకాలకు పైగా హ్యాండ్ లూమ్ చీరలు ప్రదర్శిస్తున్నారని వివరిం చారు. నేత కార్మికు లను ప్రోత్సహించడం తో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామా జిక లక్ష్యం అని తెలిపారు. మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ప్రతి నెలలో ఒకసారి ఉంటుంద న్నారు. వివరాల కోసం ఆంపిల్ రీచ్ పి.ఆర్ + 91 95429 76567 సంప్రదించాల్సిం దిగా కోరారు.