calender_icon.png 22 February, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతాంజలిలో ఘనంగా స్పోర్ట్స్‌డే

22-02-2026 12:26:31 AM

ఖమ్మం, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాలలో శనివారం స్పోర్ట్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత నాలుగు రోజుల నుంచి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, హైస్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ఈ స్పోర్ట్స్‌డే వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టీ పద్మ, టీ అరుణ్‌లు బహుమతులు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు చదవుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.