మరో వివాదంలో హిమాచల్ సీఎం
సిమ్లా, డిసెంబర్ 14: హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు వరుసగా వి వాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ‘సమోసా’ వివాదంలో చిక్కుకోగా, తాజాగా ‘అడవి కోడి’ వ్యవహారం ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. ఇటీవల సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు మెనూలో అడవి కోడి కూర కూడా ఉంది. దాన్ని వడ్డించిన వీడియో వైరల్‌గా మారిం ది.
సీఎం ఆ వంటకాన్ని తినేందుకు నిరాకరించినా సుఖుతో పాటు ఆరోగ్యమంత్రి, ఇతర అతిథులకు నిర్వాహకులు దాన్ని వడ్డించారు. అడవి కోడి కూరను మెనూలో చేర్చ డాన్ని తప్పుపడుతూ ఓ జంతు సంరక్షణ సంస్థ సోషల్ మీ డియాలో వీడి యో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో ‘అడవి కోడి’ కూడా ఉంది.
వాటిని వేటాడటం శిక్షార్హం. దాంతో సీఎం, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా సీఎం సుఖు స్పంది స్తూ ‘స్థానికులు నాకు ఆ ఆహారాన్ని వడ్డించారు. కానీ నేను దాన్ని తినలేదు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు మాత్రం తిన్నట్లు ప్రసారం చేస్తున్నాయి’ అని వెల్లడించారు.






