9 May, 2026 | 3:48 AM

తండ్రి కోసం పాట పాడిన హిమాన్షు

29-12-2024 02:49 AM

గర్వంగా ఉందని కేటీఆర్ పోస్ట్

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇప్పటికే వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. తాజా గా తన తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుతూ ఒక పాట పాడాడు. యానిమల్ మూవీలోని ‘ఓ నాన్న నువ్వు నా ప్రాణం’ అనే పాటను రికార్డు చేశాడు. అయితే ఆ పాటను తాజాగా కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

తన పుట్టినరోజు కానుకగా హిమాన్షురావు ఈ పాట ను పాడాడని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని చెప్పారు. అయితే ఆ పాటను తాను వారం క్రితం మొదటిసారి విన్నానన్నారు. హిమాన్షు గానం, పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉన్నాయని.. తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.