9 May, 2026 | 2:23 AM

ఇంటర్ విద్యకు మంగళం!

09-05-2026 12:57 AM
  1. పాఠశాల విద్యలో విలీనం దాదాపు ఖరారు
  2. నేడో, రేపో ఆర్డినెన్స్ 
  3. వ్యతిరేకిస్తున్న ఇంటర్ విద్యా జేఏసీ, లెక్చరర్లు
  4. పీవీ ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందన్న విమర్శలు  

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. నేడో, రేపో ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ తీరుపై ఇంటర్ విద్యా జేఏసీ, లెక్చరర్లతో పాటు వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యను రద్దు చేయడం తగ దని అంటున్నాయి. మన ఇంటర్ విద్య దేశానికే ఆదర్శమని, ఇతర రాష్ట్రాల్లోని బోర్డుల్లోకెల్లా మంచి పేరు ఉం దని, పీవీ ఆశయాలకు తూట్లు పొడవద్దని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.  

ఎన్‌ఈపీని అమలు చేసేందుకేనా?

1968లో అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు నేతృత్వంలో ఇంటర్ బోర్డుకు అడుగులు పడ్డాయి. అప్పుడు పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఇంటర్మీడి యట్ విద్య ప్రారంభమైంది. అప్పటి వరకు 11వ తరగతి హెచ్‌ఎస్సీగా, 12వ తరగతి పీయూసీ(ప్రీ యూనివర్సిటీ కోర్సు)గా కొనసాగేవి. దానిని సంస్కరించిన పీవీ నరసింహారావు ఇంటర్మీడియట్ విద్య తీసుకొచ్చారు. 1970 అక్టోబర్ 25న ఇంటర్మీడియట్‌గా మారుస్తూ అప్పటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది.

1969-70 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే 120 పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఇంటర్ కోర్సులను ప్రారంభిం చారు. ఆ తర్వాత 1971లో ఇంటర్‌బోర్డును ఏర్పాటు చేశా రు. నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు దశాబ్దాలుగా ఇంటర్ బోర్డు విద్యార్థులకు సేవ లందించడమే కాకుండా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది.

అయితే నాడు కాంగ్రెస్ సర్కారు తె చ్చిన సంస్కరణకు.. మళ్లీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభు త్వం మంగళం పాడుతుండటం గమనార్హం. మరోవైపు బీజేపీ పార్టీ తెచ్చిన నేషనల్ ఎడ్యుకే షన్ పాలసీ (ఎన్‌ఈపీ అమలు చేయడంలో భాగంగానే ఇంటర్ బోర్డును రద్దు చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. 

గతంలోనే అనుకున్నారు కానీ..

ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇంటర్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అవన్నీ విఫలమయ్యాయి. 1994 జనవరి 5న ప్రభుత్వం జీవో -82ను జారీ చేసి ఇంటర్ బోర్డును విలీనం చేసింది. అధ్యాపకులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 4న జీవోను రద్దుచేసింది.

2009లోను జీవో -281 ద్వారా విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ప్రభు త్వం మంత్రులతో బృందాన్ని నియమించి.. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించింది. మెజార్టీ వ్యక్తు లు విలీనాన్ని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విలీన అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హం.

అభ్యంతరాల వెల్లువ

* ఇంటర్ బోర్డును రద్దు చేసే ప్రయత్నాలపై ఇంటర్ విద్యా జేఏసీ, అధ్యాపకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

* ఇంటర్ బోర్డును రదు ్దచేయడం కోఠారి కమిషన్ సిఫారసులకు విరుద్ధం.

* స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్లుంటారు. ఇదే ఇంటర్‌కు వచ్చేసరికి  ఒక్క ఫిజిక్స్, కెమిస్ట్రీగా విడిపోతుంది. బ యాలజీ సబ్జెక్టు జువాలజీ, బోటనీగా విడిపోతుంది. ఫిజిక్స్, బయాలజీ టీచర్లు ఇంటర్ సబ్జెక్టులను ఎలా బోధిస్తారు.

* కెమిస్ట్రీలో ఇనార్గినిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులుంటాయి. ఇంత లోతైన సబ్జెక్ట్లను ఇంటర్‌లో పాఠశాల విద్యా టీచర్లు బోధించగలరా? 

* భవిష్యత్తులో జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. మళ్లీ ప్రత్యేంకగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే రోజులొస్తాయి. కోచింగ్ సెంటర్ల హవా పెరుగుతుంది. జాతీయ స్థాయిలో మన విద్యార్థులు వెనక్కిపోతారు.

* తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంటర్ అడ్మిషన్ ఒక దగ్గర ఉంటే, విద్యార్థి మరో కోచింగ్ సెంట ర్‌లో తరగతులు వింటున్నారు. ఇంటర్ బోర్డును రద్దుచేస్తే మన దగ్గర సైతం ఇదే జరగనుంది

డ్రాపౌట్‌లను సాకుగా చూపిస్తున్నారు

ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించవచ్చని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్న మాట అవాస్తవం. పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్, బాసర త్రిపుల్ ఐటీ, ఐటీఐ వంటి కోర్సుల్లో చేరుతుంటారు. అయినా ఇంటర్ అడ్మిషన్లు దరిదాపుల్లోనే ఉంటున్నాయి. ఇలాంటప్పుడు డ్రాపౌట్లు ఎక్కడివి. బోర్డు విలీనానికి డ్రాపౌట్లను సాకుగా చూపించడం తగదు. ప్రతి ఏటా సీబీఎస్‌ఈ నుంచి ఇంటర్‌లో దాదాపు 40 వేల మంది ఇటర్ విద్యలో చేరుతున్నారు.

 డా.పీ.మధుసూదన్‌రెడ్డి, 

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్