17 March, 2026 | 1:45 PM

Breaking News

హనుమాన్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలి   •   తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి   •   బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •  

హింద్ జింక్ నికరలాభం రూ.2,345 కోట్లు

03-08-2024 12:35 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 2: జింక్‌తో పాటు దేశంలో ఏకైక వెండి ఉత్పత్తి కంపెనీఅయిన హిందుస్థాన్ జింక్ నికరలాభం 2024 ఏప్రిల్ త్రైమాసికంఓ 19.3 శాతం వృద్ధిచెంది రూ. 2,345 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 1,964 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ముగిసిన త్రైమాసికంలో హింద్ జింక్ ఆదాయం రూ. 7,554 కోట్ల నుంచి రూ. 8,398 కోట్లకు పెరిగింది. జింక్ ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీ అయిన హింద్ జింక్ వెండి ఉత్పత్తిలో అంతర్జాతీయంగా మూడోస్థానాన్ని ఆక్రమిస్తున్నది. కంపెనీ దాదాపు 40 దేశాలకు ఎగుమతులు జరుపుతుండగా, భారత్ జింక్ మార్కెట్లో 75 శాతం వాటా ఉన్నది.