6 May, 2026 | 2:07 PM

దమ్మపేటలో ఈ నెల 11న హిందూ ధర్మ నమ్మేళనం

06-05-2026 01:33 PM

దమ్మపేట,(విజయక్రాంతి): ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు హిందూ ధర్మ నమ్మేళనం స్థానిక శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ నమేత విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం నందు జరుపబడుతుందని, ఈ హిందూ ధర్మ నమ్మేళనానికి అభయ హిందూ సేవ వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ విశిష్ట అతిథిగా హాజరవుతారని, ముఖ్యవక్తగా ఫణిభట్ల రాజేశ్వర శాస్త్రి, ఖమ్మం విభాగ్ నహ సంఘచాలక్ నుండి హారవుతారని హిందూ ధర్మ నమ్మేళనం కమిటీ సభ్యులు తెలిపారు.

హిందూ నమ్మేళనం అనేది హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి, సనాతన ధర్మంపై అవగాహన కల్పిండానికి ఏర్పాటు చేశారని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ నమ్మేళనాలు నిర్వహింస్తోందని, ఈ హిందూ ధర్మ నమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యం సామాజిక ఐక్యత, కుల వివక్షను తొలగించి, గడపలో కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో హిందువులందరినీ ఏకం చేయడం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ సమ్మేళనాలు కేవలం ఆధ్యాత్మిక సమావేశాలుగానే కాకుండా, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి, భావి తరాలకు మన హిందూ సాంప్రదాయాలను తెలియపరచడానికి ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దమ్మపేట మండల పరిసర ప్రాంత హిందూ బంధువులందరూ హిందూ. ధర్మరక్షణ కోసం జరిగే ఈ మహా హైందవ శంఖారావంలో పాల్గొని విజయమతం చేయాలని కోరుతూ గడప గడపకు తిరుగుతూ బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వర్ధనమ్మ, అత్తులూరి సతీష్, పసుమర్తి సత్తిపండు, గణాల చారి, బంధం చెన్నారావు. సంకు రమేష్, దారా రాణి, శ్రీదేవి, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.