6 May, 2026 | 2:00 PM

కొత్తూరులో రైతుల రాస్తారోకో

06-05-2026 01:29 PM

లక్షెట్టిపేట, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. వడ్ల తూకంలో రైస్ మిల్లర్లు 40 కిలోల సంచికి నాలుగు కిలోల వడ్లు అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్లు తడిసి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి వరి తూకంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్లు కూడా సంచికి రెండు కిలోలు అదనంగా వడ్లు ఇస్తేనే లోడింగ్‌కు వస్తామని చెబుతున్నారని రైతులు పేర్కొన్నారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించి వరి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.