హిందూజా కుటుంబం శ్రమదోపిడీ
20-06-2024 01:17 AM
లండన్, జూన్ 19: బ్రిటన్‌లో అత్యంత ధనవంతులైన భారతీయ మూలాలున్న హిందూజా కుటుం బం కార్మికులపై శ్రమదోపిడీకి పాల్పడుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తా యి. స్విట్జర్లాండ్‌లోని లేక్ జెనీవా వద్ద వారికి ఉన్న విల్లాలో కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి పనిచేయిం చుకొంటున్నారన్న ఆరోపణలపై ఆ దేశ న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది. ఇంట్లో పని మనుషులను రోజుకు 15 నుంచి 18 గంటలపాటు పనిచేయించుకొని 8 డాలర్లే చెల్లిస్తున్నారని ప్రధాన ఆరోపణ.






