హజ్‌యాత్రలో విషాదం
20-06-2024 01:16 AM
వడదెబ్బతో 550 మంది యాత్రికులు మృత్యువాత
న్యూఢిల్లీ, జూన్ 19: సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికుల్లో ఈ ఏడాది సుమారు 550 మంది వడదెబ్బ తాకిడికి మృత్యువాత పడ్డారు. మృతుల్లో 300 మందికిపైగా ఈజిప్షియన్లు, మరో 60 మంది జోర్డాన్ దేశస్థులు. మిగిలిన మృతులు వివిధ దేశాలకు చెందిన వారు. వీరి మృతదేహాలను అక్కడి అధికారులు మక్కా లోని అల్‌జ ముయిసెమ్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రస్తు తం సౌదీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.






