calender_icon.png 4 November, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

04-11-2025 04:59:36 PM

ముంబై: విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు, పవర్ గ్రిడ్, ఎటర్నల్ వంటి హెవీవెయిట్ స్టాక్‌లలో బలహీనత కారణంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 519.34 పాయింట్లు నష్టపోయి 83,459.15 వద్ద ముగియగా, నిఫ్టీ 165.70 పాయింట్లు తగ్గి 25,597.65 వద్ద స్థిరపడ్డింది.

సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ఒకటిగా నిలిచింది. 3.18 శాతం తగ్గి రూ.278.85 వద్ద ముగిసింది. ఎటర్నల్ 2.71 శాతం క్షీణించగా, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్ వరుసగా 2.35 శాతం, 1.83 శాతం, 1.73 శాతం, 1.60 శాతం నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి మరియు ఎటర్నల్ అనే ఐదు స్టాక్‌లు సెన్సెక్స్ క్షీణతకు భారీగా దోహదపడ్డాయి.

అలాగే, బిఎస్‌ఇ ఐటి సూచీ 1.06 శాతం తగ్గి 34,600.57 వద్ద ముగియగా, బిఎస్‌ఇ మెటల్ ఇండెక్స్ 1.40 శాతం తగ్గి 34,764.12 వద్ద స్థిరపడింది. మొత్తం మీద బీఎస్ఈలో చురుగ్గా ట్రేడవుతున్న 4,322 స్టాక్‌లలో 1,600 స్టాక్‌లు లాభపడి, 2,554 స్టాక్‌లు క్షీణించాయి. ఈ సెషన్‌లో 145 స్టాక్‌లు వాటి 52 వారాల గరిష్ట స్థాయిలను తాకగా, 91 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. 199 స్టాక్‌లు వాటి ఎగువ సర్క్యూట్‌లలో 153 స్టాక్‌లు దిగువ సర్క్యూట్‌లలో లాక్ అయ్యాయి.