23 May, 2026 | 8:51 AM

అన్న చేతిలో తమ్ముడు హత్య

19-06-2024 12:10 AM

మంచిర్యాల, జూన్ 18 (విజయక్రాంతి): జిల్లాలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి తమ్ముడిని కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కుంచం రాము, కుంచం విజయ్‌కుమార్ సొంత అన్నదమ్ములు. వీరిద్దరు లేబర్ పని చేసుకుని జీవనం గడుపుతున్నారు. మద్యానికి బానిసై తరచూ ఏదో విషయంలో గొడవ పడుతుండేవారు. సోమవారం రాత్రి గాంధీనగర్‌లో మద్యం తాగిన అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అన్నపై తమ్ముడు బండతో దాడి చేయగా, అన్న రాము కర్రతో తమ్ముడి తలపై బలంగా కొట్టడంతో విజయ్‌కుమార్ (26) అక్కడికక్కడే మృతిచెందాడు. ఘట న స్థలాన్ని మంగళవారం మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై రవికుమార్ సందర్శించారు. ఇద్దరికి పెండ్లి కాలేదు. తల్లిదండ్రులు సైతం చనిపోయారు.