గతంలో కుమార్తెపై లైంగికదాడి..
తాజాగా తండ్రిపై హత్యాయత్నం
వెంటాడి గొంతుకోసిన దుండుగులు
కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లికి చెందిన నార్ల నాగయ్య కుమార్తె దివ్యాంగురాలు. ఆమెపై రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన శ్యాం, రమేష్, మల్లయ్య, శ్రీకాంత్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసు త్వరలో విచారణకు వస్తుం డటంతో నిందితులు సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తున్న నాగయ్యను వెంబడించారు. కత్తులతో నాగయ్య గొంతు కోసి ఉడాయించారు. రక్తపుమడుగులో ఉన్న నాగయ్యను గమనించిన స్థానికులు హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నాగయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






