హిచ్‌కాక్ రెండో సంచిక ఆవిష్కరణ
ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి, ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ఓ పుస్తకం రూపొందింది. దీన్ని సినీ రచయిత పులగం చిన్నారాయణ.. ఐఆర్‌టీఎస్ అధికారి రవి పాడితో కలిసి ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో తీసుకొచ్చారు.
తొలి కాపీ డిసెంబర్ 18న విడుదలైంది. తాజాగా సెకండ్ ఎడిషన్‌ను టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హిచ్‌కాక్ సినిమాలు కొన్నింటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశా.
ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తా. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో పుస్తకం రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను మరిన్ని తీసుకురావడానికి సంకల్పించాలి’ అన్నారు.






