28 July, 2026 | 1:30 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఆగస్టులో రానున్న మిరాయ్

23-02-2025 12:43 AM

‘హను-మాన్’ సినిమా పాన్ ఇండియా విజయంతో దూసుకుపోతున్న తేజ, తన నెక్స్ట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’ తో మరోసారి అందరినీ అలరించబోతున్నాడు. ఈ పాన్-ఇండియా యాక్షన్- అడ్వెంచర్ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర సూపర్ హీరో స్టుల్‌లో ఎక్సయిటింగ్,  డైనమిక్‌గా ఉండబోతోంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసా ద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుందని మేకర్స్ ఒక పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విల న్ పాత్రలో కనిపించనున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసేందుకు తేజ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.