2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ షురూ

18-03-2026 12:21 AM

ముంబై, మార్చి 17: ఐపీఎల్ 2026 సీజన్ కు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా కుటుంబంతో గడిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండి యన్స్ ట్రైనింగ్ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చాడు. మాల్దీవుల్లో వెకేషన్ ముగించుకున్న హిట్‌మ్యాన్ నేరుగా వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముంబై ప్రధాన బౌలర్లందరి బౌలింగ్ లోనూ భారీ షాట్లు కొడుతూ ప్రాక్టీస్ చేశాడు.

తర్వాత సహచర ఆటగాళ్ళతో కలిసి ఫీల్డింగ్ చేసిన రోహిత్ మంచి జోష్‌లో కనిపించాడు. మొన్న టి వరకూ టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా సందడి చేసిన హిట్ మ్యాన్ ఫ్యామి లీతో వెకేషన్‌ను ఆస్వాదించాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున 15 మ్యాచ్ లలో 418 పరుగులు చేసిన రోహిత్ ఈ సారి కూడా అదే ఫామ్ కొనసాగించాలని ఎదురుచూస్తున్నాడు.

2025 సీజన్‌లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత హార్థిక్ పాండ్యా సారథ్యం లో ఆడుతున్న రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ చరిత్ర లో 6 వేలకు పైగా పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా ఘనత సాధించిన రోహిత్ తన కెప్టెన్సీలో ముంబైని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.