18 March, 2026 | 3:35 AM

రెండో టీ20లో కివీస్ విజయం

18-03-2026 12:19 AM

హామిల్టన్, మార్చి 17: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో సఫారీలు కివీస్‌ను చిత్తు చేస్తే.. రెండో టీ20లో న్యూజిలాండ్ దెబ్బకు దెబ్బ కొట్టింది. సౌతాఫ్రికాను 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 60(5 ఫోర్లు,2 సిక్సర్లు), క్లార్క్‌సన్ 26 నాటౌట్, నిక్ కెల్లీ 21, శాంట్నర్ 20 పరుగులతో రాణించారు.

ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 107 పరుగులకే కుప్పకూలిం ది. ముల్దర్(16), కాన్నర్(8), డిజోర్జి(1), హెర్మన్(19), స్మిత్(12),ఫారెస్టర్(10) పరుగులకే ఔటయ్యారు. జార్జ్ లిండే 12 బంతుల్లోనే 33( 3 ఫోర్లు,3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ (3/16), బెన్ సీర్స్ (3/14), శాంట్నర్ (2/19) రాణించారు. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.