అంబరాన్నంటిన హోళీ సంబురాలు
03-03-2026 02:35 PM
మంగపేట,(విజయక్రాంతి): రంగుల కేళి రంగేళి హోళీ పండుగను మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా ఆనందోత్సవాల నడుమ అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. హోళీ పండుగ సందర్భంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొంతమంది యువకులు టీంగా ఏర్పడి రంగులు చల్లుకుంటూ రోడ్లపై తిరుగుతూ వచ్చే పోయే వారిపై రంగుల చల్లి హోళీ పండుగ సందడి చేశారు.




