3 March, 2026 | 7:31 PM

నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

03-03-2026 05:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి హాజరయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని హోలీ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్ గోపి గోపీనాథ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, పాత్రికేయులు ఉన్నారు.