20 June, 2026 | 7:16 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

03-09-2024 11:09 AM

మెదక్,(విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు  జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు  జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యాసంస్థల సమాచారాన్ని విద్యాశాఖ అధికారి ద్వారా తెలుసుకుంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు  విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్   తెలిపారు. అధిక వర్షాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని అత్యవసర పరిస్థితి వస్తే తప్పించి బయటికి వెళ్ళవద్దని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలకు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేయు విధంగా  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9391942254 కంట్రోల్ రూము నంబర్కు  కాల్ చేయాలని తెలిపారు.