లక్ష్మీనరసింహులకు హోమ పూజలు
యాదాద్రి భువనగిరి, జూన్ 3 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని ప్రధానాలయంలో లక్ష్మీనరసింహులకు సోమవారం హోమ పూజలు వైభవంగా నిర్వహించారు. అలాగే శివాలయంలో రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. ఉత్సవ మండపంలో లక్ష్మీనరసింహులకు సుదర్శన హోమం జరిపి ఆగమశాస్త్రానుసా రం నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించా రు. స్వామివారికి సోమవారం రూ.28, 80,593 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇకపై 1000 మందికి అన్నదానం..
ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాల పెంపుపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం రోజుకు 600 మందికి జరుపుతున్న అన్నదానాన్ని 1000 మందికి పెంచుతూ సోమవారం నుంచి అమలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈవో భాస్కర్‌రావు ప్రారంభించారు. అదే విధంగా భక్తులకు దర్శన సదుపాయం పెంపు కో సం తూర్పు రాజగోపురం వద్ద రూ.150 రుసుముతో ప్రత్యేక దర్శన క్యూ కాం ప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనులను ఈవో పరిశీలించారు. భక్తులు యాదాద్రి కొండ చుట్టూ జరిపే గిరిప్రదక్షిణ రోడ్డుపై సదుపాయాల కల్ప న కోసం రహదారిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.






