17 July, 2026 | 6:41 PM

యాదగిరిపల్లికి చేరిన సౌమ్య మృతదేహం

04-06-2024 01:21 AM

యాదాద్రి భువనగిరి, జూన్ 3 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుడ్ల సౌమ్య మృతదేహం సోమవారం స్వగ్రామం యాదగిరిపల్లికి చేరింది. మే 27న ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. సౌమ్య మృతదేహానికి ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పూలమాల వేసి నివాళులర్పించి తల్లిదండ్రులను ఓదార్చారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు నివాళులర్పించారు.