17 July, 2026 | 6:23 PM

ఆఫీసులకు దూరంగా అబ్దుల్లాపూర్‌మెట్!

04-06-2024 01:28 AM
  1. కాగితాలకే పరిమితమైన మండల కేంద్రం
  2. ప్రజలకు చేరువ కాని పరిపాలన సౌలభ్యం
  3. ప్రభుత్వ కార్యాలయాలన్నీ హయత్‌నగర్‌కే పరిమితం
  4. ఎనిమిదేళ్లలో తహసీల్దార్ ఆఫీసుకు మాత్రమే మోక్షం
  5. ఇతర పనులకు 15 కి.మీ పరుగులు పెట్టాల్సిందే!
  6. స్థానిక ప్రజాప్రతినిధులకు తప్పని తిప్పలు

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 3 (విజయక్రాంతి): పాలన ఒక చోట.. ప్రభుత్వ ఆఫీసు లు మరో చోట ఉండడంతో అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ఇక మండలంలో ఉండాల్సిన అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు జీహెచ్‌ఎంపీ పరిధిలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి.

ప్రజలకు ప్రభుత్వ కార్యాయాలు అందుబాటు ఉండాలనే ఉద్దేశంతో 2016 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి ప్రభుత్వం అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ, నేటి వరకు కూడా మండలం హోదాకు తగ్గట్లుగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలనాపరమైన వసతులు కల్పించకపోవడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఒక్క తహసీల్దార్ కార్యాలయం మినహా ఇతర కార్యాలయాలేవీ ఇంకా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోం ది. అదీగాక 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్న హామీలు ప్రగల్భాలుగానే మిగిలి పోయాయి.   

స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. మండల సర్వసభ సమాశాలు, సమీక్ష సమావేశాలకు హాజరు కావాలంటే అబ్దుల్లాపూర్‌మెట్  నుంచి హయత్‌నగర్‌కు రావాల్సిందే. దాదాపు 15 కి.మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో, అగ్రికల్చర్, వెలుగు, ఇంజనీరింగ్, పీహెచ్‌సీ, ఐకేపీ ఇలా దాదాపు అన్నీప్రభుత్వ కార్యాలయాలు హయత్ నగర్‌లోనే ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పటికైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అబ్దు ల్లాపూర్‌మెట్ ప్రజల అవస్థలను అర్థం చేసుకుని పరిపాలనపరమైన సౌలభ్యం కల్పిం చాలని, అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.  

అభివృద్ధికి నోచుకోలేదుఅబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి సంబంధించిన ఆఫీసులన్నీ హయత్‌నగర్‌లో ఉండడంతో ఇక్కడ ఎలాంటి అభి వృద్ధి జరగడం లేదు. ఎంపీడీవో, ఎం పీవో, అగికల్చర్, డ్రాక్వా భవనం, పీహెచ్‌సీ, ఐకేపీ సెంట్రల్, ఇంజనీరింగ్ విభాగం ఆఫీసులు హయత్‌నగర్‌లోనే ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో ఏ అవసరం పడినా ప్రజలు 15కిలోమీటర్లు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.  ప్రభుత్వ కార్యాయాలను తక్షణమే అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రానికి తరలించాలి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలలి.  

 ఏర్పుల నర్సింహ, 

సీపీఎం మండల కార్యదర్శి


పేరుకే మండలం

అబ్దుల్లాపూర్‌మెట్ పేరుకే మండ లం కానీ ప్రభుత్వ కార్యాలయాన్నీ హయత్‌నగర్‌లో ఉన్నాయి. గత ప్రభు త్వం ఆఫీసులు తరలించే విషయంలో విఫలమైంది.  ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రభుత్వ ఆఫీసులు అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రానికి తరలించాలి. 100 పడకల ఆస్పత్రి నిర్మించాలి. విద్యార్థుల కోసం ఒక  కాలేజీ కట్టించాలి.  అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి.

 చిత్రం కృష్ణ

బీఎస్పీ నాయకులు, గౌరెల్లి