8 April, 2026 | 8:24 PM

హనీ వచ్చేది అప్పుడే

02-01-2026 12:08 AM

నవీన్‌చంద్ర, దివ్య పిళ్లు ప్రధాన పాత్రల్లో కరుణకుమార్ రచనాదర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘హనీ’. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దివి, రాజారవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవ ఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందీ చిత్రం. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ గురువారం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ; డీవోపీ: నగేశ్ బన్నెల్; ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్.