01-01-2026 12:00:00 AM
స్టార్ హీరో యష్ తాజాచిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. యష్, గీతూ మోహన్ దాస్ కలిసి కథను రాయగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం 2026, మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచార చిత్రాలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి పాత్రల ఫస్ట్‌లుక్స్ విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు గంగ పాత్రలో నటిస్తున్న నయనతార ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో గంభీరమైన హావభావాలతో కనిపిస్తోంది.
ఈ సినిమాలో నయనతార ఓ డార్క్ వరల్డ్‌లోని పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాజీవ్ రవి నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్), అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.