02-01-2026 12:09:40 AM
‘హీరో విశ్వక్ సేన్ ఓ పొలిటికల్ డ్రామాతో పలకరించబోతున్నారు. సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా ‘లెగసీ’ అనే టైటిల్‌తో రూపొందుతోంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్‌రెడ్డి దైదా నిర్మాతలు. కొత్త సంవత్సర సందర్భంగా ఈ సినిమాను గురువారం ప్రకటించారు మేకర్స్. అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారస త్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేశ్, సచిన్ ఖేడేకర్, మురళీమోహన్, కేకే మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.