2 May, 2026 | 9:16 PM

Breaking News

మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •  

మండల సెకండ్‌ టాపర్‌ దివ్యశ్రీకి ఘన సన్మానం.

02-05-2026 07:27 PM

​ములకలపల్లి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తన్నీరు దివ్యశ్రీని చైతన్య ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన దివ్యశ్రీ 547 మార్కులు సాధించి మండల సెకండ్ టాపర్‌గా నిలిచింది. చైతన్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఈర్ల రామ్మోహన్ రావు అధ్యక్షతన దివ్యశ్రీకి చిరు సన్మానం నిర్వహించారు.​

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్యశ్రీ, చదువుపై మక్కువతో కష్టపడి మండల స్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం గర్వకారణమని కొనియాడారు. ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న పవన్ కుమార్ కుమార్తెగా తండ్రి బాటలోనే క్రమశిక్షణతో చదివి నేటి తరం విద్యార్థులకు దివ్యశ్రీ ఆదర్శంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ​