14 May, 2026 | 4:03 AM

ఆర్యవైశ్య విద్యార్థులకు సన్మానం

14-05-2026 02:54 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆర్యవైశ్య విద్యార్థులు 550 మార్కులకుపై వచ్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఐ వి ఎఫ్ కమిటీ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జిల్లాలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పదవ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను మొట్టమొదటిసారిగా సన్మానించడం జరుగుతుందన్నారు.

ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఐ వి ఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల ల శ్రీనివాసు గుప్త, జైల శాఖ హైదరాబాద్ రేంజ్ డి ఐ జి దుద్దెల శ్రీనివాస్ లో విద్యార్థులను అభినందించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులు వారి వివరాలను సమన్వయకర్త డాక్టర్ బాలు 9492874006 కి వాట్సాప్ ద్వారా తెలపాలని సూచించారు.

ఈనెల 18 లోపు వచ్చిన విద్యార్థులకు మాత్రమే అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. జిల్లాలోని ఆర్యవైశ్య విద్యార్థులు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్, పట్టణ వైశ్య సంఘాలు సహకరించి ఉత్తమ విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఐ వి ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, దొంతి సుధాకర్, కస్వ వెంకటేష్, చిలువేరి మారుతి, ఎర్రం విజయ్ కుమార్ లను సంప్రదించాలన్నారు.