15 March, 2026 | 4:56 PM

గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం... మెడికల్ పరిక్ష లు

15-03-2026 02:14 PM

రామగిరి,(విజయక్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగ రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానించి, మెడికల్ టెస్టులు నిర్వహించారు. అనంతరం టెస్టులకు సంబంధించిన మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా మండల పంచాయతీ అధికారి సమ్మిరెడ్డి,  ఏఎన్ఎం శారద, ఆశావర్కర్ లు శిరీష, సుమలత, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.