29 April, 2026 | 8:24 PM

పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం

29-04-2026 06:50 PM

మంగపేట,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అక్కెనపెళ్లి వెంకటేశ్వర్లు ఇద్దరు కుమార్తెలు అక్కెనపెళ్లి రీత్విక, మధుమిత బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఉత్తమ జీపీఏ సాధించిన అక్కెనపెళ్లి రీత్విక, మధుమిత అనే ఇద్దరు స్టూడెంట్స్ ను  మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది దాగం ఆదినారాయణ బుధవారం శాలువాలతో ఘనంగా సన్మానించి మేమెంటో  అందజేశారు. ఈ సందర్భంగా  దాగం ఆదినారాయణ మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ, అంకితభావంతో, ఇష్టపడి చదువుతూ మరిన్ని విజయాలు సాధించాలని, కన్న వారికి , పుట్టి పెరిగిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు.