30 June, 2026 | 11:26 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

500పైన మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం

07-06-2025 12:28 AM

 బాన్సువాడ జూన్ 6 (విజయక్రాంతి) : మహమ్మద్ నగర్ మండలం కోమలంచ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అందులో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కోమలంచ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బాలచందర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని,ప్రవేట్ పాఠశాలల్లో చేర్పించద్దని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సదుపాయాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలకు మరియు ప్రైవేటు పాఠశాలకు తేడాను తెలియజేశారు.అనంతరం ఈ సంవత్సరంలో పదవ తరగతిలో 500 పైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు గ్రామ మాజీ సర్పంచ్ సాధన సత్యనారాయణ మొదటి బహుమతి వెయ్యి రూపాయలు, రెండో బహుమతి కింద ఇద్దరి విద్యార్థినులకు చెరో 500 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

అనంతరం ఆ ముగ్గురు విద్యార్థినిలకు శాలువాతో సన్మానం చేసి, ఆ విద్యార్థినులకు త్రిబుల్ ఐటీ లో సీటు రావడానికి అహర్నిశలు కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి శాలువతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ సాధన సత్యనారాయణ, మాజీ సిడిసి చైర్మన్, బీ గంగారెడ్డి, బి.ఆర్.ఎస్ గ్రామ అధ్యక్షులు బలరాంరెడ్డి, నాగభూషణం గౌడ్, పోత గౌడ్, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.