21-02-2026 12:00:00 AM
మోటార్ సైకిళ్లతో సర్కస్ పీట్లు మాజీ ఎంపీపీకి తీవ్ర గాయాలు
కుషాయిగూడ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : కీసర మండలంలోని నాగారంలో పోకిరీల ఆగడాలు మళ్లీ వెలుగుచూశాయి. మైనర్లు మోటార్ సైకిళ్లపై అతి వేగంతో సర్కస్ పీట్లు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో కీసర మాజీ ఎంపీపీ ముప్పు రామిరెడ్డిని నిర్లక్ష్యంగా నడిపిన మోటార్ సైకిల్తో ఢీకొట్టారు. ఈ ఘట నలో రామిరెడ్డికి తీవ్ర గాయా కావడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన అనంతరం ముగ్గురు పోకిరీలలో ఇద్దరు పరారయ్యారు. ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పట్టుబడిన యువకుడిని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.