గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు
కరీంనగర్, మార్చి17(విజయక్రాంతి): యుద్ధ ప్రభావం ఇటు వ్యాపారులు అటు వినియోగదారులపై తీ వ్ర భారం మోపుతున్నది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకా శన్నంటుతుండగా గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. కరీంనగర్, రామగుండం, జగిత్యాల ప్రాం తంలో టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలు, మిర్చి బజ్జీల బండ్లు గ్యాస్ దొరకక మూతపడుతున్నాయి..
దీంతో రోజువారీ వ్యాపారం చేసుకునే వారు ఇబ్బందులు ప డుతున్నారు. పలు హోటళ్లలో ఇప్పటికే పూ రి, దోశ వంటి టిఫిన్లను నిలిపివేశారు. గ్యా స్పు ఆధారపడే హోటళ్లు, స్ట్రీట్ఫుడ్లు మూతపడుతున్నాయి. కొందరు ప్రత్యామ్నా యం గా కట్టెల పొయ్యితో టిఫిన్లు, భోజనాలు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇన్ని రోజు మూడింతల రేట్లతో కొనుగోలు చేసి నెట్టుకువచ్చామని,
కానీ గ్యాస్ దొరకక పోవడంతో హోటళ్లను మూసివేసే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటర్లలో ఇడ్లిలు చేసుకుంటూ కాస్తోకూస్తో ఉపాధి పొందుతు న్నారు. హోటళ్లలో పని చేసే కార్మికుల కు, మాస్టర్లకు రోజూ బారి వేతనాలు ఆగిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్పీ జీ గృహ కనెక్షన్లు 10.80 లక్షల వరకు ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల సంఖ్య 2.62 లక్షల వరకు ఉన్నయి.
సరఫరాపై నిబంధనలు
యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటి కే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. టే హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. చాలా చోట్ల మూత పడుతు న్నాయి. కరీంనగర్ కామన్ ప్రాంతంలో ఒక టిఫిన్ సెంటర్ యజమాని ఏకంగా ఫ్లెక్సీ ని అమర్చాడు అంటే అర్రం చేసుకోవచ్చు.
డిమాండ్కు సరిపడా కమర్షియల్ సిలిండర్లు లేకపోవడం, సరఫరా చేసే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రభావం గృహ క నెక్షన్లపైనా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎల్పీజీ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. యు ద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో కచ్చితం గా కొరత ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వినియోగదా రులు భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్లు బుక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈక్రమంలో బుకింగ్ల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నది.
గత గణాంకాల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలో నెలలో 4 నుంచి 5 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవి. సగటున రోజుకు 15 నుంచి 16 వేల కనెక్షన్లు బుక్ అ య్యేవి. కానీ, గడిచిన నాలుగు రోజులుగా రోజుకు 25వేల పైచిలుకు బుకింగ్ అవుతున్నట్టు ఆయా గ్యాస్ కంపెనీలు ఏజెన్సీల ద్వారా తెలుస్తున్నది. గతంలో ఒక సిలిండర్ పూర్తయిన తర్వాత బుక్ చేసుకునేవారు. ప్రస్తుతం సిలిండర్ పూర్తి కాకముందే ముం దు జాగ్రత్తగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.




