ఛీ.. ఛీ.. రోడ్లు..!
- మున్నాళ్ల ముచ్చటగా గ్రామాల్లో సీసీ రోడ్లు
నెలలు దాటక ముందే నెర్రెలు వారుతున్న వైనం
ప్రయాణానికి తప్పని ఇక్కట్లు
నాణ్యతతో కూడిన పనులు చేయాలని ప్రజల వేడుకోలు
మోతె, మార్చి 17 : ప్రజల అవసరాలు తీర్చడానికి ఏ ప్రభుత్వమైనా నిధులను మంజూరు చేసి మౌలిక వసతులు కల్పిస్తుంది. నిధులు మంజూరీ, పనులు అమలు చేయమని ఆదేశాలు జారీ చేయడం వరకు ఓకే.. కానీ పాలకుల స్వార్ధ పూరిత అమలు తీరు మాత్రం ప్రజలపాలిత శాపంగా మారుతుంది. తమ స్వార్థంతో వచ్చిన నిధులు ఎక్కువగా నొక్కుతూ కొద్ది గొప్ప నిధులతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో ఆ పనులు కాస్త నాసిరకంగా మారిపోతున్నాయి. ఆ నాసి రకం పనులతో వేసిన సిసి రోడ్లు, కట్టిన భవనాలు సంవత్సరం వరకు ఈ ఇబ్బందులు కలుగకుండా ఉండడం గగనంగా మారింది
ఏడాది లోపే బీటలు..
గ్రామాలలో నాసిరకం పనులతో ఏడాది తిరుగకముందే రోడ్లు, భవనాలు పగుళ్ళు రావడం, బీటలు వారి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటున్నాయి. దీంతో ప్రజల అవసరాలు తీరకపోగా అవస్థలు పడాల్సిన పరిస్థి తి నెలకొన్నది. ప్రస్తుతం ఇదే పరిస్థితి మోతె మండలంలో చాలా చోట్ల కనిపిస్తుంది.
నాసిరకం పనులతో ప్రజలు ఇబ్బందులు..
సీసీ రోడ్ల నిర్మాణానికి వాస్తవికంగా నాణ్యతతో కూడిన ఇసుక, సిమెంట్ వాడా ల్సి ఉంటుంది. కానీ వాటికి బదులుగా డస్ట్ ఎక్కువగా వాడడం, సిమెంట్ పాళ్లను పెం చడం వల్ల రోడ్లు నాసిరకంగా ఉంటున్నా యి. ఆ కారణం చేతనే సీ సీ రోడ్లపై పగుళ్ళు వచ్చి ఆరు నెలల్లోనే పాడైపోతున్నాయని స్థానికులే ఆరోపిస్తున్నారు..
పర్యవేక్షణ కరువు..
వాస్తవికంగా నిధులు మంజూరైన తదుపరి పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనులు ప్రారంభం నుంచి పూర్తయ్యేంతవరకు అనుక్షణం దాన్ని పర్యవేక్షిస్తుండాలి. ప్రభుత్వ నిబంధనలకు లోబడే పనులు చేయాలి కానీ వారు కూడా కాసులకు కక్కుర్తి పడో, లేక కాంట్రాక్టర్‌కు, అధికారులకు మ ధ్య ఉన్నటువంటి సాన్నీహిత్యమో కానీ అవే ప్రజలపాలిటి శాపంగా మారుతున్నాయి.
సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టే పనులలో కమిషన్లకు ఆశపడే అధికారు లు వాటిని నామమాత్రంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో దీన్ని పరిశీలించాల్సి ఉండగా ఆ పరిశీలనలు తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సర్పంచులే కాంట్రాక్టర్లు..
గ్రామాలలో చేపడుతున్న పనులలో ఎక్కువ శాతం సర్పంచులే చేపడుతున్నారు. సర్పంచులే పనులు చేయడం వల్ల వాళ్లకి అయినటువంటి ఎన్నికల ఖర్చులు కూడా తొందరగా పూడ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎక్కువ మొత్తంలో నొక్కుతూ తక్కువ పెట్టుబడితోనే నాసిరకం రోడ్లు, భవనాలు నిర్మిస్తున్నారు. వాళ్లు చేస్తున్నటువంటి పనులను అధికారులు నిరంతర పర్యవేక్షణ లోపించడంతో పనులు నాసిరకంగా చేసినా ఎక్కడ ఇబ్బంది కలగడం లేదనేది ప్రధాన ఆరోపణ.
మున్నాళ్ల ముచ్చటే..
నాణ్యతతో కూడిన ఇసుక మంచి గ్రేడ్ కలిగినటువంటి సిమెంటు ఏవి ఎంత మో తాదులో వాడాలో అంతే మోతాదులో వా డాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ అధికారులకి కమిషన్లు ఇవ్వడంతోని వాళ్లు ఏమి మాట్లాడకుండా కాంట్రాక్టర్లకి వత్తాసు పలుకు తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను గ్రామాల వెంట ఉన్నటు వంటి చిన్న వాగు, వంకల నుంచి నాసిరకం ఇసుక తోలుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
దాంట్లో నల్ల మట్టి ఉన్నా... అదే మట్టితో కూడినటువంటి ఇసుకను తీసుకొచ్చి సిసి రోడ్లు పోయడానికి, భవనాలు కట్టడానికి ఉపయోగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు దీన్ని నిరంతరం పరిశీలించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ కి కక్కుర్తి పడి వాళ్లు కూడా పరిశీలన చేయడం లేదనే అభియోగాలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.
పాత సర్పంచులకు దక్కని చెల్లింపులు..
గతంలో చేసినటువంటి పనులకి బిల్లుల రాకపోవడంతోని సర్పంచులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడంతోని ప్రభుత్వం గతంలో చేసినపనులకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ నిధులు మంజూరైన తర్వాత కొత్తగా ఎంపికైనటువంటి సర్పంచులు మాత్రం తాము నూతనంగా చేసిన పనులకే బిల్లులు తీసుకుంటూ వారికి ఇవ్వకుండా అడ్డుపడు తున్నట్లుగా తెలుస్తుంది. పాత పనులు చేసిన సదరు సర్పంచ్‌లు,
కాంట్రాక్టర్‌లు మండల, జిల్లా స్థాయి అధికారులకి పలుమార్లు కలిసి వినతి పత్రం ఇచ్చి తమకు చెల్లింపులు చేయించాలని మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి నాణ్యతతో కూడిన పనులు చేయించడంతోపాటు, పాత సర్పంచ్‌లు, కాం ట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నాణ్యతతో కూడిన పనులు చేయాలి..
గామాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్లలో మాసీ రకం పనులు చేస్తున్నారు. దీంతో రోడ్లు 6 నెలలు గడవక ముందే పగుళ్లు ఏర్పడి ప్రయాణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నాణ్యతతో కూడిన పనులు చేసి ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూడాలి.
ఇరుగు వినయ్, బుర్కచర్ల గ్రామస్తుడు
అధికారులు పర్యవేక్షించాలి..
ప్రభుత్వం విడుదల చేసే నిధులతో గ్రామాలలో చేసే పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించకపోవడం వల్ల నాసిరకం పనులు చేస్తున్నారు. ఇసుక, సిమెంట్ లను నాణ్యత లేనివి వాడడం వల్ల గ్రామాలలో చేసే పనులు మూన్నాళ్ళ ముచ్చటగానే మారిపోతున్నాయి. కావున అధికారులు నిరంతర పర్యవేక్షణలు చేస్తూ నాణ్యతతో కూడిన పనులు చేయించాలి.
పడిశాల వెంకటేష్, విభళాపురం గ్రామస్తుడు
నా దృష్టికి వస్తే పరిశీలిస్తా..
గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్లు కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలకు అవి నిర్మించిన కొన్నాళ్లలోనే పగుళ్లు వస్తాయన్న ఫిర్యాదులు నాకు అందలేదు. మండలం లోని ఏ గ్రామంలోనైనా ఫిర్యాదులు వస్తే తప్పకుండా వాటిని పరిశీలన చేస్తా.. సంబంధిత వ్యక్తుల పైన తప్పకుండా చర్యలు తీసుకునేలా చూస్తా.
ఆంజనేయులు, ఎంపీడీవో, మోతె




