పారమిత వరల్డ్ స్కూల్‌లో హౌస్ ప్రారంభ వేడుకలు
07-08-2026 08:12 PM
మానకొండూరు,(విజయక్రాంతి): అల్గునూర్లోని పారమిత వరల్డ్ స్కూల్లో శుక్రవారం హౌస్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పారమిత పాఠశాలల డైరెక్టర్ ఇ ప్రసూన ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు హౌస్ల వారీగా పతాకావిష్కరణ, క్రీడా ప్రమాణ స్వీకారం, మార్చి ఫాస్ట్ చేశారు. అనంతరం విద్యార్థులను గగన్, పృథ్వి, అగ్ని, సూర్య హౌస్లుగా విభజించి, ఆయా హౌస్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, ప్రిన్సిపాల్ ఎం. శ్రీకర్,సమన్వయ కర్త దీప్తి రాణి హౌస్ కన్వీనర్ కె. శ్రీనివాస్, పీ.ఈ.టీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






