29 June, 2026 | 2:05 AM

గ్రామ స్థాయి నుండే పార్టీ బలోపేతానికి శ్రీకారం

29-06-2026 12:00 AM

టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సాయ గౌడ్

సదాశివ నగర్, జూన్ 28 (విజయక్రాంతి):కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని అమర్లబండ గ్రామంలో టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ గ్రామ కమిటీని ఆదివారం ఎన్నిక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా నిర్వ్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలనే లక్ష్యంతో.. సదాశివనగర్ మండల పార్టీ అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం అమర్లబండ గ్రామ శాఖ నూతన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

అమర్ల బండ గ్రామస్తులు, పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుండెల్లి సాయికుమార్, ఉపాధ్యక్షుడి గా పర్దీ పెట్ దినేష్, ప్రధాన కార్యదర్శిగా న్యాలపురం రజనీకాంత్, కార్యదర్శి గా న్యాలపురం మోహన్, కోశాధికారిగా గుండెల్లి రవీందర్, సలహాదారు గా న్యాలపురం రమేష్, యువతను ఏకం చేసే దిశగా గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులు గా పర్దీ పెట్ రావణ్, ఉపాధ్యక్షుడిగా  సంగనోల్ల మహేష్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా గుండెల్లి సతీష్, కార్యదర్శిగా న్యాలపురం శేఖర్, కోశాధికారి న్యాలపురం రంజిత్, సలహాదారులుగా పర్దీపెట్ అఖిల్ లను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన ఉభయ అధ్యక్షులకు, కార్యదర్శులకు మండల అధ్యక్షుడు సాయగౌడ్  పార్టీ కండువాలు కప్పి, సాదరంగా బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల టి ఆర్ ఎస్ అధ్యక్షుడు సాయగౌడ్ మాట్లాడుతూ  అమర్లబండ గ్రామంలో యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి పార్టీ బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని అన్నారు. రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీలు నిరంతరం శ్రమించాలని ఆయన  దిశానిర్దేశం చేశారు. 

రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో ఇదే స్ఫూర్తితో కమిటీలను వేసి టీఆర్‌ఎస్ జెండాను రెపరెపలాడిస్తామని  మండల అధ్యక్షుడు సాయగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల  పార్టీ నాయకులు  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ ఇంచార్జ్ మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, యువ నాయకుడు శివ కుమార్, కుప్రియాల్ గ్రామ ఇంచార్జ్ గొలుసుల లింగం, ఏస్సీ సెల్ సీనియర్ నాయకులు జంగం గారి సాయిలు, జంగం గారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.