17 March, 2026 | 4:24 AM

పెద్దమల్లారెడ్డిలో ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశం

17-03-2026 01:51 AM

భిక్కనూర్, మార్చి16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ప్రారంభించి లబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, మాధవరెడ్డి, వడ్ల శ్రీనివాస్, సత్తయ్య, నట్ట లింగం, బాలరాజు, బుడ్డ శీను, నర్సింలు పాల్గొన్నారు. అలాగే గ్రామ కార్యదర్శి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.